Student Suicide: కర్నూలు నగర పరిధిలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2 రోజుల క్రితం అధ్యాపకులు మందలించడంతో మనస్తాపానికి గురై భవనం 9వ అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి మృతి చెందడంతో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. చదువులో ఒత్తిడా.. వేరే కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Read Also: Kidnap: బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్
