NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao : పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ-కాంగ్రెస్ కూటమికి మధ్యే పోటీ

Kunamneni

Kunamneni

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ కూటమికి మద్య పోరాటమన్నారు వరంగల్ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరితో ఉన్నారు.? అని ఆయన ప్రశ్నించారు. ఒకటీ రెండో చోట్ల బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇండియా కూటమికి సహకరిస్తారా..? బీజేపీ కి మద్దతిస్తారా..? అని ఆయన అన్నారు. ఎంఐఎం పార్టీ బీజేపీ అంతా మత ఉన్మాదం కలిగిన పార్టీలా మేం భావించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలి… ఆ పార్టీ దారి తప్పితే దానికి వైద్యం చేస్తామని, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం.. ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తామన్నారు కూనంనేని సాంబశివరావు. దేశంలో రామ జపం మోడీ జపంగా మారిందని, బీజేపీ బరితెగించి రాముణ్ణి రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. శాస్త్ర సాంప్రదాయాలను పెక్కన పెట్టి అన్నీ మోడీ అయ్యాడని, రాముడి పేరుతో ప్రజలను రెచ్చ గొట్టిఓట్లు దందుకోడం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. దేశాన్ని ఒక మతానికి పరిమితం చేయడం మంచిది కాదని, ఈ పాపపు పనులకు కచ్చితంగా నరకంలోకి పోతారన్నారు. వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి ఐదు స్థానాల్లో ఒక పార్లమెంట్ స్థానం సీపీఐకి ఇవ్వాల్సిందేనన్నారు.

కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్‌ శాపనార్దాలు, పోకడలు ప్రజాతీర్పుకి విరుద్ధంగా ఉన్నాయని, బీఆర్‌ఎస్‌ నేతల తీరు పుట్టినబిడ్డ కళ్ళు కూడా తెరవక ముందే గొంతునులిమి చంపేలా ఉందన్నారు కూనంనేని సాంబశివ రావు. కంసుడి లాంటి వాళ్ళు బీఆర్‌ఎస్‌ నాయకులు, తాము తప్ప మరెవరూ ఉండకూడదని కుట్రలు చేస్తున్నారని, గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలనే పనిలోనే బీఆర్‌ఎస్‌ ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాలకు మించి బీఆర్‌ఎస్‌ గెలవదన్నారు. కంసుడి వధ తరహాలో వీరి పతనం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ స్నేహధర్మం ప్రకారం చేస్తే మీకు కూడా మంచిదని, తెలంగాణలో ఐదు స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నామన్నారు. కమ్యూనిస్టులతో కలువడం వల్లే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిందని, చత్తీస్ ఘడ్ లో కలుపుకుపోలేదు కాబట్టే ఓటమి చెందిందననారు. ఓటమితో బీఆర్‌ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.