Kumbham Anil Kumar Reddy Criticized Komatireddy Rajgopal Reddy.
కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీ అధికారం లేకుండా ఉన్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం కరెక్ట్ కాదు ఆరోపించారు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో హనుమన్ వాడ జరిగిన బొడ్రాయి ప్రతిష్ట, ఎల్లమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొన్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ పార్టీ మారుతున్న కాంగ్రెస్ నాయకులు పైన విమర్శలు గుప్పించారు. పీజేఆర్ కూతురు విజయ రెడ్డి ని పార్టీ లోకి రావడంతోనే దాసోజ్ శ్రవణ్ పార్టీ మరిండు ఖైరతాబాద్ టికెట్ రాదు అనే కారణంగా శ్రవణ్ పార్టీ నుంచి వెళ్లడం మంచిది కాదు అని అన్నారు.
ఈటల రాజేందర్ ఈడి భయనికే బిజెపి పార్టీ లో చేరిండు. అయిన మారడంలో ఉన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీ మారాడు అని అన్నారు.ఎన్నికల సందర్భంగా పెన్షన్లు గుర్తుకు వచ్చాయి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్ళీ మాయ మాటలు ప్రజల ముందుకు వస్తుండు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సూచించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలోనే పెద్ద నాయకుడు అని కొనియాడారు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన దయాకర్ మాట్లాడిన మాటలు మంచిది కాదు అందరికి బాధ కలిగింది అని ఆవేదన వ్యక్తంచేశారు.