MLC Kumbha Ravibabu: దేశ చరిత్రలో ఆరోగ్య శ్రీ ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అన్నారు.. తాజాగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.. ప్రతి పార్లమెంట్‌లో మల్టీ హాస్పిటల్స్ పెట్టాలని, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు పెంచడం కోసం ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్‌లు మొదలు పెట్టారన్నారు.. రాష్ట్రంలో అరకొర సీట్లు సరిపోక ఇతర దేశాలకు విద్యార్థులు పోతున్నారని తెలిపారు.. చంద్రబాబు 4సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకొని రాలేదని విమర్శించారు.. రాష్ట్రంలో 2014 ముందు 44వేల వైద్యులు ఉంటే 2019లో ఆ సంఖ్యను 88 వేలకు పెంచారని చెప్పారు..
READ MORE: PhonePe IPO: మెగా ఐపీఓకు ఫోన్ పే.. రూ.12 వేల కోట్ల టార్గెట్ !
పరిపాలన కేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చారని ఎమ్మెల్సీ కుంభ రవిబాబు తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ సాయంతో 17 మెడికల్ కాలేజ్‌లు తీసుకొచ్చిన ఘనత జగన్‌దేనన్నారు. ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయి క్లాసులు నడుస్తున్నాయని చెప్పారు.. పులివెందుల మెడికల్ కాలేజ్ కు 50 సీట్లు ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన వద్దని లేఖ రాసిన దురదృష్ట ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో పీపీపీ మోడ్‌లోకి తీసుకెళ్లాలని అనుకుంటుందన్నారు.. ఈ నిర్ణయాన్ని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని.. పీపీపీ విధానం ప్రజల ఆరోగ్య స్థితులపై తీవ్రమైన దెబ్బ కొట్టినట్లు అవుతుందన్నారు.. కార్పొరేట్ హాస్పిటల్లో 10% బెడ్లను పేద వాళ్లకు కేటాయించాలని ఉంది.. ఎన్ఎంసీ ఇచ్చిన నామ్స్ ని ఏ కార్పొరేట్ హాస్పిటల్ అమలు చేయడం లేదని ఆరోపించారు.. మెడికల్ కాలేజీలు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని పక్క ఆర్థిక విధానాలు అవలంబించాలన్నారు.. రూ. 8000 కోట్లు ఖర్చుపెడితే లక్ష కోట్లు కాపాడవచ్చన్నారు.
READ MORE: Rithu Chowdary : రీతూతో అర్ధరాత్రి డ్రగ్స్.. వీడియోలు లీక్.. అసలు నిజాలు బయటపెట్టిన హీరో
