NTV Telugu Site icon

Kumari Aunty: సీరియల్స్ లోకి వచ్చేసిన కుమారీ ఆంటీ..

Kumari

Kumari

ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్‌ ఫుడ్‌ బిజినెస్‌ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. బిజినెస్ మాట అంటుంచి అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. తాజాగా ఓ సీరియల్ లో కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

ఇకపోతే కుమారీ ఆంటీ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.. స్టార్‌ మా నిర్వహించిన బీబీ ఉత్సవం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చింది కుమారీ ఆంటీ. పైగా షోలో పాల్గొన్నవారందరికి తన ఫుడ్‌ స్టాల్‌ నుంచే నాన్‌వెజ్‌ భోజనం తీసుకువచ్చి.. వారికి స్వయంగా వడ్డించినట్లు వీడియోలో ఉంది.. ఆ వీడియో ఇప్పటికి నెట్టింట ట్రెండ్ అవుతుంది..

ఇప్పుడు మరోసారి బుల్లితెరపై కుమారీ ఆంటీ కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బుల్లితెర పై ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమయ్యే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే సీరియల్ లో ఒక చిన్న అతిధి పాత్ర కోసం కుమారి ఆంటీ ని రప్పించారు.. ఆ సీరియల్ లోని సీన్ వీడియోనే సోషల్ మీడియా వైరల్ గా మారుతుంది.. ఒకసారి ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..