కుమారి ఆంటీ అందరికీ సుపరిచితమే. హైదరాబాద్‌లో ఫుడ్ వ్యాపారం చేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమె ఫేమస్ అవ్వడంతో భారీగా జనాలు ఫుడ్ సెంటర్ కి వచ్చే వాళ్లు. రోడ్‌పై ఫుడ్ అమ్మడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నందున.. పోలీసులు అక్కడ వ్యాపారం చేసుకోకూడదని హెచ్చరించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె ఫుడ్ వ్యాపారం చేసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిన ఆమె.. అనంతరం వార్తా పత్రికలు, టీవీ ఛానెలలో కూడా వచ్చారు. దీంతో కుమారి ఆంటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ రావడంతో సెలబ్రిటీ అయిపోయారు. కుమారి ఆంటీ పలు సీరియల్స్, షోస్‌లో సందడి చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
READ MORE: Vivek Ramaswamy: వివేక్ రామస్వామిని అవమానించిన రచయిత్రి.. ఏమన్నారంటే..?
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల వేళ కుమారి ఆంటీ రీ ఎంట్రీ ఇచ్చారు. కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి ఆంటీ సపోర్ట్ చేస్తూ.. 32,31,25,21,24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కుమారి ఆంటీ. అంతేకాకుండా తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేస్తున్నట్లు తెలిపి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వాటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. కాగా.. ఎన్నికలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో ఫుల్ బిజి బిజీగా ఉన్నారు. అన్ని పట్టణాల్లో, పల్లెల్లో ప్రచారం చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు.