NTV Telugu Site icon

Kumaraswamy: ప్రజ్వల్ రేవణ్ణకు బాబాయ్ విజ్ఞప్తి.. ఏం సలహా ఇచ్చారంటే..!

Kumar Swami

Kumar Swami

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక లైంగిక వేధింపుల వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ప్రజ్వల్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు.

ఇది కూడా చదవండి: Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ మేకింగ్ వీడియో అదిరిపోయిందిగా..

ఇదిలా ఉంటే తాజాగా ప్రజ్వల్ బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజ్వల్‌ భారత్‌కు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చి విచారణను ఎదుర్కోవాలని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణల విషయంలో తమ పార్టీకి, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ప్రజ్వల్ కేసుకు… పొత్తుకు ఎలాంటి సంబంధం లేదని కుమారస్వామి తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Work From Shoe Shop: చెప్పుల షాప్లో ల్యాప్టాప్లో మీటింగ్కు అటెండ్.. ఉద్యోగుల కష్టాలు మాములుగా లేవుగా..

ప్రజ్వల్ ఏప్రిల్ 27న దౌత్యపరమైన పాస్‌పోర్టుతో జర్మనీకి వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హాసన్‌ నియోజకవర్గ ఎన్నికలు జరిగిన మరునాడు విదేశాలకు వెళ్లిన ప్రజ్వల్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని వీరిద్దరికీ సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకు వారం రోజుల సమయం కావాలని ప్రజ్వల్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన దర్యాప్తు బృందం ఆయనపై లుకౌట్‌ నోటీసు జారీ చేసింది. దీంతో ప్రజ్వల్‌ దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: OG : ‘ఓజి’ మూవీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్ వైరల్.