Site icon NTV Telugu

Ranji Trophy 2024: 4 బంతుల్లో 4 వికెట్లు.. రికార్డుల్లోకెక్కిన భారత బౌలర్‌!

Kulwant Khejroliya

Kulwant Khejroliya

Kulwant Khejroliya picks 4 wickets in 4 balls: భారత బౌలర్‌, మధ్యప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ కుల్వంత్‌ కేజ్రోలియా రికార్డుల్లోకెక్కాడు. రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కుల్వంత్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్‌లో కుల్వంత్ ఈ ఘనతను అందుకున్నాడు.

95వ ఓవర్‌లోని 2, 3, 4, 5 బంతులకు కుల్వంత్‌ కేజ్రోలియా వికెట్స్ పడగొట్టాడు. మధ్యప్రదేశ్‌ బ్యాటర్లు షెష్వాత్ రావత్, మహేష్ పీతియా, భార్గవ్ భట్, ఆకాశ్ సింగ్‌లను ఔట్ చేశాడు. ఇంతకుముందు ఢిల్లీ బౌలర్‌ శంకర్‌ సైనీ (1988), జమ్మూ కశ్మీర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ముదాసిర్‌ (2018)లు రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. మధ్యప్రదేశ్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన మూడో బౌలర్‌గా.. రంజీల్లో హ్యాట్రిక్‌ సాధించిన 80వ క్రికెటర్‌గా కుల్వంత్‌ రికార్డుల్లోకెక్కాడు.

Also Read: Bangladesh Captain: షకీబ్‌ అల్‌ హసన్‌ బిజీ.. బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్‌!

నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనత అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే సాధించారు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్‌ మలింగ, వెస్టిండీస్ వెటరన్ పేసర్ ఆండ్రీ రసెల్‌, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్‌ అఫ్రిది, ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌, వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనత ఏ భారత బౌలర్‌పై లేదు.

 

Exit mobile version