NTV Telugu Site icon

IND vs NZ: న్యూజిలాండ్ వెన్నెముక విరిచేసిన కుల్దీప్ యాదవ్..

Kuldeep Yadav

Kuldeep Yadav

భారతదేశం- న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది. మరోవైపు, కివీస్ జట్టు దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ మ్యాచ్‌కు చేరుకుంది.

READ MORE: TG GOVT: నేతన్నలకు తీపికబురు.. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీఓ

వరుణ్ చక్రవర్తి నుంచి తప్పించుకునేందుకు కివీస్ బ్యాట్స్‌మన్ ప్రత్యేక సన్నాహాలతో వచ్చారు. కానీ కుల్దీప్‌ను అంచనా వేయలేకపోయారు. గత మ్యాచ్‌లో విల్ యంగ్, రచిన్ రవీంద్రల ఓపెనింగ్ జోడీ భారత బౌలర్లను ఇబ్బంది పెట్టింది. రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ కివీస్ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముక. కాబట్టి ఈ రెండు వికెట్లు భారత జట్టుకు చాలా ముఖ్యమైనవి. తాజా మ్యాచ్‌లో కుల్దీప్ ఎనిమిది బంతుల్లో రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ల పనిని ముగించాడు. ముందుగా, కుల్దీప్ స్పిన్నింగ్ డెలివరీతో రవీంద్రను బౌల్డ్ చేశాడు. రిటర్న్‌ క్యాచ్‌తో కేన్‌ విలియమ్సన్‌ (11)ను పెవిలియన్‌కు పంపించాడు.

READ MORE: Hyundai Super Delight March Offer: కార్లపై ఆఫర్ల వర్షం.. ఆ మోడల్ పై రూ. 55 వేల డిస్కౌంట్