టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ టీ20 చరిత్రలో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో లంక బ్యాటర్ చరిత్ అసలంకను ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. 2025 ఆసియా కప్‌లో భారత్ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 13 వికెట్స్ పడగొట్టాడు. ఈ క్రమంలో పలువురి రికార్డ్స్ బద్దలయ్యాయి.
ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో అమ్జాద్ జావేద్ (యూఏఈ) రెండవ స్థానంలో ఉన్నాడు. 2016 ఆసియా కప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరపున జావేద్ ఏడు మ్యాచ్‌లు ఆడి 12 వికెట్స్ తీశాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (11) అల్-అమీన్ హొస్సేన్ (11), మహ్మద్ నవీద్ (11) తరవాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఆసియా కప్ టీ20ల్లో ఒక ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (13) తీసిన బౌలర్‌గా కుల్దీప్ మరో రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (11), హార్దిక్ పాండ్యా (7), జస్‌ప్రీత్ బుమ్రా (6), ఆశిష్ నెహ్రా (6) ఉన్నారు.
Also Read: Mary Kom: బాక్సర్ మేరీ కోమ్ ఇంట్లో దొంగతనం!
ఇక ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు (వన్డేలు + టీ20లు) తీసిన జాబితాలో కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. కుల్దీప్ 17 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ మొదటి స్థానంలో ఉన్నాడు. లంక తరపున 15 మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు పడగొట్టాడు. ముత్తయ్య మురళీధరన్ (30), రవీంద్ర జడేజా (29), షకీబ్ అల్ హసన్ (28), అజంతా మెండిస్ (26), సయీద్ అజ్మల్ (26) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసియా కప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (వన్డేలు + టీ20లు) తీసిన మొదటి బౌలర్‌గా కూడా నిలిచాడు.
