Asia Cup 2023: శ్రీలంకపై విజయం.. ఫైనల్లో భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2023: ఆసియా కప్‌లో తన జోరును కొనసాగిస్తోంది టీమిండియా.. నిన్న పాకిస్థాన్‌పై చిరస్మరనీయ విక్టరీ కొట్టి సత్తా చాటిన భారత్.. ఈ రోజు శ్రీలంక బౌలర్ల దాటికి తక్కువ స్కోర్ చేసినా.. విజయాన్ని అందుకుంది.. లంకపై 41 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 213 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.. ఇక, 214 పరుగుల టార్గెట్ చేధనలో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుంచి కష్టాల్లో పడింది.. అయితే, యువ ఆటగాడు దునీత్ వెల్లలాగే బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేయడమే కాదు.. బ్యాట్‌కు కూడా పనిచేసి శ్రీలంక విజయంపై ఆశలు రేపాడు.. కానీ, ఇతర బ్యాట్స్‌మన్స్ నుంచి సరైన సహకారం అందలేదు.. దీంతో.. 172 పరుగులకే శ్రీలంక పెవిలియన్ చేరింది.. దీంతో.. 41 పరుగుల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది.. భారత బౌలర్లలో 4 వికెట్లు తీసి కుల్దీప్ సత్తా చాటగా.. జడేజా, బూమ్రా చెరో రెండు వికట్లు, సిరాజ్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు..
బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో లంక యువ స్పిన్నర్ దునీత్ వెల్లలాగే రాణించాడు.. బ్యాటింగ్ లో దునీత్ 42 పరుగులతో ఆకట్టుకోగా.. బౌలింగ్ లో భారత ఆటగాళ్ల 5 కీలక వికెట్లు తీశాడు.. దీంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ చివరికి 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో వర్షం అంతరాయం కలిగించినా, కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో భారత్ వికెట్లు తీయడంలో కీలక భూమిక పోషించాడు. మరో స్పిన్నర్ చరిత్ అసలంక 4 వికెట్లతో భారత లోయరార్డర్ పనిబట్టాడు. మిస్టరీ స్పిన్నర్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది. ఇక, భారత్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ 33, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 26 పరుగులు సాధించాడు. మిగతావారు చెప్పుకోదగిన స్థాయిలో స్కోర్లు చేయలేకపోయారు.
Also Read
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
4 పాయింట్లతో సూపర్ ఫోర్ టేబుల్లో టాప్ స్పాట్లో నిలిచింది టీమిండియా.. రెండో స్థానంలో శ్రీలంక ఉండగా.. మూడో స్థానంలో పాకిస్థాన్ నిలిచింది.. మరోవైపు.. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానానికి పరిమితమైంది బంగ్లాదేశ్.. మరోవైపు.. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు.. వన్డేల్లో 150 వికెట్లు తీసిన బౌలర్ గా కుల్దీప్ నిలిచాడు.. 88 వన్డేల్లో 150 వికెట్లు తీసిన బౌలర్ గా కుల్దీప్ కొత్త రికార్డు నెలకొల్పాడు.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!