Kukatpally: హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బి కాలనీ రోడ్డు నంబర్ 5 వద్ద అమానుష సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హాస్టల్‌లో కొందరు యువకులు స్థానిక కుటుంబంపై దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్ నంబర్ 5లో నివసిస్తున్న ఒక కుటుంబం తమ ఇంటి ముందు హాస్టల్ యువకులు బైకులు పార్క్ చేస్తున్నారని పలుమార్లు వారిని హెచ్చరించినట్టు, హాస్టల్ మేనేజ్మెంట్‌కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డికి ఛాన్స్..!
తాజాగా అక్కడ బయట నిలిపిన బైక్ సీటు కవర్ కట్ అయిందనే కారణంతో ఆగ్రహించిన సుమారు 30మంది హాస్టల్ యువకులు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వారిలో కొందరు ఇంట్లోకి చొరబడి గృహిణిపై కూడా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన యువకులపై, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ మేనేజ్మెంట్‌పై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
Maharashtra: ఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం.. ఇద్దరు అరెస్ట్
