మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గాయమైంది. జిమ్ వర్కౌట్ సెషన్‌లో స్లిప్ డిస్క్ గాయం అయినట్లు కేటీఆర్ తెలిపారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకొని త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: Multizone IG: కర్రెగుట్ట ఆపరేషన్స్‌లో టీజీ పోలీసులు పాత్ర లేదు.. తెలంగాణ మావోయిస్టులు లొంగిపోవాలి..
కాగా.. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని, రజతోత్సవ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎల్కతుర్తితో ఆదివారం జరిగిన రజతోత్సవ సభపై ఈ రోజు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేసిన తెలంగాణకు ధన్యవాదాలు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సభల్లో ఒకటిగా నిలిచిపోతుంది. నిన్నటి సమావేశం రజతోత్సవ కార్యక్రమాలకు ప్రారంభం మాత్రమే. ఇకపై తానే ముందుండి పోరాడతానని కేసీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చాం. ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతాం. ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతాం’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
