Site icon NTV Telugu

KTR : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది

Ed Ktr

Ed Ktr

KTR : నిన్నటి అసెంబ్లీ సమావేశం.. తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏడాదికాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదని ఆయన విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందని, అసెంబ్లీ లో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకే ఏమాత్రం క్లారిటీ లేదన్నారు కేటీఆర్‌. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయిందని, రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారెంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయిందని, అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహుల గాంధీ గారు తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదన్నారు కేటీఆర్‌. అంతేకాకుండా.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం.. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ అని ఆయన ఆరోపించారు.

benefits your baby: కంగారూ లాగా మీ పిల్లల్ని హత్తుకొని ఉండటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి..

Exit mobile version