KTR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతామని అంటున్నారని విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. వీటితోపాటు ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే, అది గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ కార్డులతో ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. దీనికి ప్రతీకారంగా, మనం తయారు చేసిన ‘బాకీ కార్డు’ను ఇంటింటికి పంపించాలని ఆయన తమ పార్టీ శ్రేణులకు సూచించారు.
Ram Chandra Rao: బీజేపీ బలహీనంగా లేదు.. బలంగా ఉంది.. నెం.1గా మేమే ఉంటాం
