Site icon NTV Telugu

KTR: ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Ktr

Ktr

ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో.. ఫార్ములా ఈ- రేస్ జరిగింది 2023లోనని తెలిపారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ- కార్ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అంటారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధం అని కేటీఆర్ అన్నారు.

Read Also: Vijayasai Reddy: ఈడీ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!

మరోవైపు.. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్లి, మళ్లీ రావడంపై అడ్వకేట్ సోమ భరత్ మాట్లాడారు. లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వొకేట్‌ను ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది.. ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ఓపిక పట్టి తమకు టైం ఇవ్వండని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చామని తెలిపారు. ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాం.. అడ్వొకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్ అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చి హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకు రావద్దు అనడం ఏంటి అని ప్రశ్నించారు. ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు రాసుకున్నారు.. ఇవాళ అది జరగకూడదని తాము కలిసి వెళ్ళామని చెప్పారు. అడ్వకేట్‌ను అసలు ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వ లేదు.. దాని వల్ల మీకు నష్టం ఏమిటని అడ్వొకేట్ సోమ భరత్ ప్రశ్నించారు.

Read Also: Formula E-Car Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కొత్త ట్విస్ట్..

Exit mobile version