NTV Telugu Site icon

Minister KTR: ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు

Ktr

Ktr

కల్వకుర్తి నియోజకవర్గంలో పలు పార్టీలో నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో చేరికలు. ఇక, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల గౌడ్ లు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 40 మంది అభ్యర్థులు లేరు అని ఆయన విమర్శించారు. అమెరికా ప్రెసిడెంట్ లాగా నేను పీసీసీ ప్రెసిడెంట్ అంటారు.. కేసీఆర్ ఒక వైపు.. సంచుల మోసిన దొంగ మరో వైపు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?

కాంగ్రెస్ అంటే కుంభకోణాలు, కుంభ మేళాలు చెయ్యాలి అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.. ఇప్పటి వరకు అవకాశం ఇస్తే ఏమి చేసింది కాంగ్రెస్ ?.. భూముల ధరలు పెరిగితే అభివృద్ధి అవుతుందా అని ఒకడు అంటాడు.. భూముల ధరలు పెరిగితే ఆ కుటుంబకు ధీమా ఉంటుంది.. కేసీఆర్ పథకాలు అమలు చేస్తామని బీజేపీ అంటుంది.. అవి కేసీఆర్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు ఎంది పీకేది?.. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందని ఊరు లేదు అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read Also: DH Srinivas Rao: ప్రతిపక్షాలు అనవసరంగా ఏఎన్ఎమ్ లను రెచ్చగొడుతున్నాయి..

కొంత మంది కుంభ కోణాలు.. లంభ కోణాలు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అని కేటీఆర్ అన్నారు. తలకొండ పల్లి వస్తా.. పెద్ద మీటింగ్ పెట్టండి.. ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం.. కాంగ్రెస్ వస్తే 40 వేల పెన్షన్ ఇస్తామని అని ఎదైనా చెబుతారు. కాంగ్రెస్ పాలన కరెంట్ ఇయ్యలేదు.. ఈ పిచ్చివాళ్లను 55 ఏళ్లు నమ్మి మోసం పోయం.. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే మళ్ళీ అంధకారం వస్తుంది.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బీ-ఫార్మ్ కావాలంటే ఢిల్లీకి పోవాలి అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read Also: Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ

ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు జరుగనున్నాయని కేటీఆర్ కామెంట్స్ చేశాడు. బీజేపీ మతం మంటలు పెడుతుంది.. కేసీఆర్ ను జైలుకు పంపుతానని విమర్శించిన వ్యక్తినే ఇప్పుడు షెడ్డుకు పోయిండు అంటూ కేటీఆర్ సెటైర్ వేశాడు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరవాత అందరం కలిసి పని చేయాలి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాను.. పాలమూరులో 14 సీట్లు గెలుచుకోవాలి అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు.