NTV Telugu Site icon

Minister KTR : కాలికి గాయంతోనే ప్రజాసేవలో కేటీఆర్‌

Minister Ktr

Minister Ktr

Telangana Minister KTR Review Meeting with Various Officials over Telangana Rains.

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఎడమ కాలికి గాయం కావడంతో ఆయనను కొన్ని రోజుల పాటు వైద్యులు ఇంటివద్దనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన కేటీఆర్‌ ప్రజాసేవను మాత్రం పక్కన పెట్టలేదు. ఇంటివద్ద నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలమవుతున్న తెలంగాణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు పబ్లీక్‌ సర్వీస్‌ఫ్రమ్‌హోం చేస్తున్నారు కేటీఆర్‌. అయితే తాజాగా నేడు.. మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో వర్షాలు, వరదల వల్ల జీహెచ్ఎంసీ, పరిస్థితిపై జలమండలి, పురపాలకశాఖ అధికారులతో ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

Bandi Sanjay : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై బండి సంజయ్‌ ఏమన్నారంటే..?

 

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్‌.. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, పురాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు కేటీఆర్‌. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్‌ అధికారులకు సూచించారు.