Site icon NTV Telugu

KTR : ఏకంగా తెలంగాణ గొంతుక కేసీఆర్‌పైనే నిషేధమా..?

Ktr

Ktr

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్‌ అయిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే.. దీనిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ.. తెలంగాణ గొంతుక అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? అని ప్రశ్నించారు. మోడీ విద్వేషాలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రకవచనాల్లాగా అనిపించాయా అనిప్రశ్నించారు. ఇది బడేభాయ్,చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా అని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర చూసి బీజేపీ,కాంగ్రెస్ బయపడుతున్నాయని విమర్శించారు. వాళ్ల అహంకారానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

 

Exit mobile version