NTV Telugu Site icon

KTR: నన్ను అరెస్ట్ ఎప్పుడు చేస్తారు..? పదే పదే ఏసీబీని ప్రశ్నించిన కేటీఆర్

Ktr

Ktr

ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణకు తనతో పాటు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలు అంశాలను ఏసీబీ చర్చకు తెచ్చింది. కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్‌ ముందుంచినట్లు సమాచారం. అయితే విచారణ సమయంలో కేటీఆర్ ఏసీబీ అధికారులను పదే పదే ప్రశ్నించారు.

Read Also: Dhanasree Verma : ఎద అందాలతో పిచ్చెక్కినస్తున్న ధ‌న‌శ్రీ వ‌ర్మ‌

తనను ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారని పదేపదే కేటీఆర్ అధికారులను అడిగారు. ఇప్పుడు చేస్తున్న విచారణ అంతా ఫార్మాలిటీనే కదా..? అరెస్ట్‌ చేయడం ఖాయమే కదా? అని అధికారులను అడిగారు. పండుగ హాలిడేస్‌ ఉన్నాయి కనుక ఈ రోజే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇవే కాకుండా.. మరిన్ని ప్రశ్నలు ఏసీబీ అధికారులను కేటీఆర్ అడిగినట్లు తెలుస్తోంది. దాదాపు 7 గంటల విచారణ అనంతరం కేటీఆర్ బయటికొచ్చారు. సాయంత్రం 5 గంటలకు మీరు వెళ్లొచ్చని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు చెప్పడంతో విచారణ ముగిసింది.

Read Also: Same-sex Marriage: స్వలింగ వివాహాలపై రివ్యూ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు..

విచారణ అనంతరం బయటికొచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని కేటీఆర్ చెప్పారు. తనకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పానన్నారు. రేవంత్‌ ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారు.. విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్‌ చెప్పారు.

Show comments