KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ఏడాది జూన్ 20, 21 తేదీలలో ఇంగ్లాండ్‌లో నిర్వహించబడనున్న ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ (Oxford India Forum) సదస్సుకు ముఖ్యఅతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సును ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠి ప్రకటించారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను ఈ సదస్సులో భాగంగా వివిధ దేశాల నిపుణులు, విద్యార్థులతో పంచుకుంటే చర్చలు మరింత ఆసక్తికరంగా మారతాయని, తద్వారా భారత అభివృద్ధి ప్రస్థానంలో భాగమవడానికి వారందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని సిద్ధార్థ్ సేఠి తెలిపారు.
Simhachalam Tragedy: ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం.. అధికారులను ప్రశ్నించనున్న కమిటీ
ఈ సదస్సులో, ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశంపై ముఖ్యంగా చర్చ జరగనుంది. ఈ వేదికపై కేటీఆర్ భారత దేశ ప్రగతిని, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్‌ను ప్రదర్శించనున్నారు. కేటీఆర్ ఆగమనం ద్వారా భారతదేశం భవిష్యత్తులో ప్రపంచపై చూపే సానుకూల ప్రభావం, నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి బలంగా చాటిచెప్పే అవకాశం ఉందని సిద్ధార్థ్ సేఠి చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్, యూరప్‌లో భారత్‌కు సంబంధించిన అతి పెద్ద వేదికగా, భారత పురోగతి, ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ సదస్సు భారత దేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో జరిగిన మార్పులు, గ్లోబల్ సహకార అవకాశాలను పటిష్టపరచడంపై చర్చిస్తుందని చెప్పారు.
Gutha Sukender Reddy : సోనియా గాంధీ ఎప్పటికైనా తెలంగాణకు దేవతే..
