KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. జూబ్లీహిల్స్‌లో మన గెలుపు ఖాయం, మెజార్టీ తెచ్చుకోవడమే మన చేతుల్లో ఉందని తాజాగా జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల రోజులు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు చెప్పాలని.. కారు, బుల్డోజర్ మధ్య యుద్ధం జరుగుతుందని, రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉందని కేటీఆర్ అన్నారు.
అలాగే అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని రేవంత్ రెడ్డి ఒక కాగితం ఇచ్చాడు. కానీ, కోర్టు కేసులో ఉన్న అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ రావడం అసాధ్యం అన్న విషయం రేవంత్‌కే తెలుసునని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ఓట్ల కోసమే చేస్తున్న రాజకీయ నాటకమని, గెలవలేక పక్క దారులు పడుతున్నారని ఆయంబ విమర్శలు గుప్పించారు. ఒక్క ఇంట్లోనే 40 దొంగ ఓట్లు రాయించుకున్నారని విమర్శించారు. గత ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంపై ఆయన సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆ కుటుంబం అనాధ కాదు. ఆ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం. ఈరోజు బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులందరం జూబ్లీహిల్స్‌లో వారికి బలం ఇవ్వడానికి వచ్చాం అని అన్నారు.
S*xual Harassment: మైనర్ బాలుడుపై లైంగిక దాడి నిజమే.. దర్యాప్తు ఆధికారి హాట్ కామెంట్స్
ఇక జూబ్లీహిల్స్‌లో పోరు మొదలైందని.. ప్రజలు మన దిక్కు ఉన్నారని, నిజం మన దిక్కు ఉంది, ధర్మం మన దిక్కు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ మోసం చేసినందుకు ప్రజలు స్వయంగా సమాధానం చెబుతారని.. మోసపోయిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఈసారి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల రోజులు ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి నిజం చెప్పాలని.. జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరడం మనందరి లక్ష్యం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
“కాంగ్రెస్ పెద్దలు ముసలమ్మలకు, ముసలయ్యలకు నెలకు రూ.4000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 24 నెలలు గడిచాయి.. ఒక్క పైసా ఇచ్చారా? బాకీ మొత్తం రూ.48,000 అయ్యింది. అలాగే 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి, మహాలక్ష్మి పథకం అన్నీ మాటలకే పరిమితం అయ్యాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాకీల లెక్కను ప్రజల ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రతి ముసలమ్మకు రూ.48,000, ప్రతి మహిళకు రూ.50,000 బాకీ ఉన్నదని బాకీ కార్డుతో చెప్పాలి. ఈ సారి కాంగ్రెస్ మోసానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు.
Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!
