కేటీఆర్ మంచి మనసు… మరో విద్యార్థికి ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థి కారం శ్రీలతకి మంత్రి కే తారకరామారావు అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం కి చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. తన నిరుపేద పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్ కర్నూల్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ-జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటి వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు.
ఇప్పటిదాకా పూర్తి స్థాయి ప్రభుత్వ విద్యను అభ్యసించిన శ్రీలత కి ఐఐటి ఫీజులు చెల్లించేందుకు మార్గం లేక తన ఉన్నత విద్య స్వప్నం చెదిరి పోతుందేమోనని ఇబ్బందులు పడుతున్న శ్రీలత పరిస్థితి మంత్రి కే తారకరామారావు దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆయన తన సొంత నిధులతో శ్రీలత ఐఐటి విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో శ్రీలతను అభినందించారు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
అత్యంత నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం లక్షలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని కేటీఆర్ అన్నారు. శ్రీలత లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డ కి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి విద్యకు అవసరమైన డబ్బులను అందించారు. భవిష్యత్తులోనూ శ్రీలతకు అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐటీలోనూ మరింత ప్రతిభ చాటాలని అభినందించారు
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!