రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు.
National Girlfriends Day 2024: జాతీయ గర్ల్‌ఫ్రెండ్స్ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే?
అంతేకాకుండా.. ఈ క్రూరమైన చర్యలు మహిళలకు తీవ్రమైన భద్రత లేకపోవడం , రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ఎత్తి చూపుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, నేరాలు పెరగడం ప్రత్యక్ష ఫలితమే అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని, సత్వర న్యాయం, దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కేటీఆర్.
Devineni Uma: ప్రజా సమస్యను తీర్చేందుకు టీడీపీ-జనసేన- బీజేపీలు కృషి చేస్తున్నాయి..