NTV Telugu Site icon

KTR : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధిపొందారా…

Brs Ktr

Brs Ktr

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధిపోందారా అని కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారన్నారు. రైతులకు రైతు బంధు రావడం లేదని, దేవుళ్ళు పై ఓట్టు వేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే … బీజేపీ, కాంగ్రెస్ కు భయం ఉంటుందన్నారు. చేవెళ్ల ఆలంపూర్ లో బీఆర్‌ఎస్ గెలుస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లు వస్తే.. కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తామన్నారు కేటీఆర్‌.

అంతేకాకుండా..’కడియం శ్రీహరి 2013లో పార్టీలో చేరాడు. 10 సంవత్సరాలలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఉపముఖ్యమంత్రి పదవులను అనుభవించారు. కడియం శ్రీహరి… ఆరూరి రమేష్ నమ్మించి గొంతు కోశారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పాడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారు. వరంగల్ లో కాంగ్రెస్ 3 స్థానంలో ఉంట్టుంది. మోడీ పాలనలో అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఆదానీ, అంబానీలకు 14లక్షల కోట్లు మాఫీ చేశాడు. శ్రీరాముడు అందరి వాడు, దేవున్ని అడ్డుపెట్టుకొనీ కేసీఆర్ రాజకీయం చేయలేదు. కేంద్రంకు తెలంగాణ పై చిన్నచూపు చూస్తోంది. 10, 12 సీట్లు వస్తే దేశ రాజకీయాలలో మార్పు వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే పోలీసులు అధికారులు భయపడుతారు, 2014లో 2018లో బిజెపి గాలి ఉన్న బి ఆర్ ఎస్ అడ్డుకుంది..’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.