NTV Telugu Site icon

KTR: ముగిసిన కేటీఆర్‌ ఈడీ విచారణ..

Ktr Ed Investigation

Ktr Ed Investigation

KTR: ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్‌ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. నగదు బదిలీ చుట్టూనే ఈడీ ప్రశ్నలు తిరుగాయని, నిబంధనలు పాటించకుండా పౌండ్లలోకి మార్చి పంపడంపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. HMDA ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపుపైనే ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. నిధుల బదలాయింపులో FEMA నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ ప్రశ్నించింది. అయితే.. ఈ విచారణ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా, బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో పోలీసుల వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Saif Ali Khan: మా బెడ్‌రూమ్‌కి రండి.. అప్పట్లో వారిపై సైఫ్ అసహనం!

Show comments