NTV Telugu Site icon

Musi River: గోదావరి నీళ్లను మూసిలోకి తేవాలని ప్రయత్నం చేశాము: కేటీఆర్

Ktr

Ktr

Musi River: శనివారం నాడు నాగోల్ లో STPని గ్రేటర్ పరిధిలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో STP లను గ్రేటర్ ఎమ్మెల్యేలు పరిశీలించారు. నగరంలో 320 MLD సామర్ధ్యంతో అతిపెద్ద నాగోల్ STP నిర్మించారు. తమ ప్రభుత్వంలో నిర్మాణము పూర్తి అయిన ఈ STP ని వెంటనే ప్రారంభం చేయాలని డిమాండ్ చేసారు వారు. ఈ సందర్బంగా కేటీఆర్ వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణరావు, కాలేరు వెంకటేష్, లక్ష్మరెడ్డి, వివేకానందలు ఉన్నారు.

Jan Suraj Party Meeting: ప్రశాంత్ కిషోర్ పార్టీ సమావేశంలో టికెట్‌ పంపిణీపై రచ్చ రచ్చ

ఈ సందర్బంగా కేటీఆర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. నాగోల్ ఉన్న STP భారతదేశంలోనే అతి పెద్దదని, హైదరాబాద్ కు మూసి నది ఒక వరమని ఆయన అన్నారు. అయితే, గత ప్రభుత్వాల వల్లే మూసి ఈ దుస్థితని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేసారు. అందుకు గాను.. అవును, గతంలో రేవంత్ రెడ్డి పనిచేసిన, ఇప్పుడు ఉన్న పార్టీలే మూసి దుర్గంధంకు కారణమని అన్నారు. బిఆర్ఎస్ వచ్చిన వెంటనే 2015లో మూసి పునరుజ్జీవనం మొదలు పెట్టామని, మొదటి దశలో రూ.3866 కోట్లతో STPల నిర్మాణం చేశామని ఆయన అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా చేయాల్సింది ఏమి లేదని, కేవలం ప్రారంభం చేయడం మాత్రమే మిగిలి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికీ సీఎం చేసే పని అదే.. మనం నిర్మిస్తే ఆయన ప్రారంభం చేస్తున్నాడని, మొత్తం పూర్తి అయిన ప్రక్షాళనకు చేసేది ఏమి లేదంటూ పేర్కొన్నారు.

IND vs NZ: బాబోయ్ మళ్లీ వచ్చేశాడు.. నిలిచిన బెంగళూరు టెస్టు! 12 పరుగుల వెనుకంజలో భారత్

మూసి పైన 15 బ్రిడ్జ్లు కట్టడానికి ప్లాన్ చేశామని, ఈ నీళ్లు ఎంత శుద్ది చేసినా.. వాటిని తాగలేమని అన్నారు. అందుకే గోదావరి నీళ్లను మూసి లోకి తేవాలని ప్రయత్నం చేశామని ఆయన అన్నారు. దేశంలో వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం డబ్బులను మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకోసం హైడ్రాను, మూసి ఎన్నుకున్నాడని.. మమ్మల్ని మూసి పక్కన మూడు నెలలు ఉండమని రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు. అయితే, మాకు మూసి కొత్త ఏమి కాదని.. మేము చిన్నప్పుడు సికింద్రాబాద్ నింబోలి అడ్డలో ఉన్నామని.. అది మూసి పక్కనే ఉంటుందని తెలిపారు. సీఎం మహబూబ్ నగర్ నుంచి వచ్చాడని.. నేను ఇక్కడ లోకల్ వాడినే అంటూ..
మూసి పక్కన ఉన్నవాళ్ళకి లేని బాధ రేవంత్ రెడ్డికి ఎందుకు అంటూ ప్రశ్నించారు.