KTR : రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలి
- తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారు
- తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మలేదు
- ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో 3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదన్నారు. మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణలో ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ. 3000 రూపాయలు ఇస్తామని నయవంచన చేసే కుట్రను ప్రజలు గుర్తుపట్టారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా కాంగ్రెస్ ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు. మహారాష్ట్రలోఅదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని కేటీఆర్ అన్నారు.ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కి కేటీఆర్ సలహా ఇచ్చారు.
రానున్నది ప్రాంతీయ పార్టీల శకమే
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, ప్రాంతీయ ఆస్తిత్వాలను చులకనగా చూసిన బీజేపీ రెండు జాతీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల నాటి నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైందని గుర్తు చేశారు. భవిష్యత్ లోనూ ఇదే ట్రెండ్ కొనసాగటం ఖాయమన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవని కేటీఆర్ చెప్పారు. జాతీయ పార్టీలకు అడ్డుగా నిలబడి రాష్ట్రాల అస్తిత్వం, అభివృద్ధి కోసం పోరాటం చేసే పార్టీలను వేధిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతామని జార్ఖండ్ ప్రజలు నిరూపించారన్నారు. హేమంత్ సోరెన్ ను వేధించిన కేంద్రానికి ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. జార్ఖండ్ లో ఘన విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా కు, ఆ పార్టీ అధ్యక్షులు హేమంత్ సోరెన్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ప్రాంతీయ పార్టీలతో అండతోనే మహారాష్ట్రలో బీజేపీ గెలు పు
మహారాష్ట్రలోనూ బీజేపీ గెలిచేందుకు ప్రాంతీయ పార్టీ నేతలు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లే కీలకమయ్యారన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగడం దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులను ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలిస్తే దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధి ఆ తీర్పు దోహదం చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ చేతగాని తనంతోనే బీజేపీ పురోగతి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలహీన పడుతుందని కేటీఆర్ చెప్పారు. గతంలో హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో గెలుస్తుంది అని భావించినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రజల మనసులను ఆ పార్టీ గెలుచుకోలేకపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మోసాలను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని తేలిపోయిందన్నారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. తమ చేతగాని తనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు…బీజేపీ తక్కువ కాదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసిన ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరన్నారు.
TTD: ఈనెల 28వ తేదీ నుండి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!