NTV Telugu Site icon

Kshama Bindu: తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా బిందు .. గ్రాండ్ గా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్..వీడియో వైరల్

Kshama Bindu

Kshama Bindu

Kshama Bindu : తనను తాను పెళ్లి చేసుకుని సంచలనంగా రేపిన గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. గత ఏడాది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో చాలా మంది వాటిని చూస్తూ ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది.. పిచ్చిదేమో.. లేక ఫెమస్ అవ్వాలనో అంటూ రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంది.. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.. తాజాగా ఆమె మొదటి పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోల ను సోషల్ మీడియాలో వదిలింది.. దాంతో మళ్లీ ఆమె పేరు వార్తల్లో మోగుతుంది..

విషయానికొస్తే.. గుజరాత్ వడోదరకు చెందిన క్షమా బిందు జూన్ 8, 2022 లో తనను తాను పెళ్లి చేసుకున్న యువతిగా సంచలనం రేపింది. పెళ్లి తరువాత సింగిల్‌గానే హనీమూన్‌ కి కూడా వెళ్లి ఎంజాయ్ చేసింది. కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె పెళ్లి వేడుకను ఘనంగా చేసుకుంది.. అయితే రీసెంట్‌గా క్షమా బిందు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది…

ఆ వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.. మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియోలో తన పెళ్లికి సంబందించిన ఫోటోలను, వీడియోలను షేర్ చెయ్యడం తో పాటు పెళ్లి తర్వాత తను ఎలా గడిపింది అనే వీడియోను కూడా సోషల్ మీడియాలో ద్వారా పోస్ట్ చేసింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ‘వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని కామెంట్లు పెడుతున్నారు. గ్రేట్, సూపర్ అంటూ రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. కొంతమంది పిచ్చి పదిరకాలు అందులో ఇది కూడా ఒకటి అని దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు.. మొత్తానికి తనను తానే పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా సంతోషంగా ఉందని తెలుస్తుంది..

Show comments