Cyclone Mandous : బంగాళా ఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను ఏపీని హడలెత్తిస్తోంది.దీంతో సీఎం జగన్ తుపాన్ ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్లు ప్రాంతవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుపాన్ ప్రభావం ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాల జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read Also: Floods in Pakistan: పాకిస్తాన్ లో వరద బీభత్సం.. లక్షలాది జీవితాలు అతలాకుతలం
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాండస్ తుఫాను 9వతేదీ అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో ఈనెల 10వ తేదీ వరకూ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
Read Also: Amaravati : చిట్ ఫండ్ కేసులపై ఓ కన్నేయండి
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు సీఎస్ తెలిపారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వర్షాలు,భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యునికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని సీఎస్.డా. జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.