NTV Telugu Site icon

Krunal Pandya: మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్.. పోస్ట్ వైరల్..

Krunal Pandya

Krunal Pandya

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఓ మోస్తరుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని జట్లు ‘ప్లే ఆఫ్’ బెర్త్ కోసం తెగ పోరాడుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెట్ సోదరులు పాండే ఫ్యామిలీ నుండి శుభవార్త వచ్చింది. పాండ్య కుటుంబంలోకి ఓ బుడ్డోడు కొత్తగా చేరాడు. ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సోదరుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడైన కృనాల్ పాండ్య మరోసారి తండ్రి అయ్యాడు.

Also Read: Jasprit Bumrah: ఏంటి బుమ్రా ఆ ప్రాక్టీస్.. ఓపెనర్‌గా రాబోతున్నావా ఏంటి..? వీడియో వైరల్..

కృనాల్ పాండ్య సతీమణి ఏప్రిల్ 21న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాకపోతే ఈ సంతోషకరమైన విషయాన్ని తాజాగా కృనాల్ పాండ్య తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తాజాగా కృనాల్ షేర్ చేశాడు. ఈ ఫోటోలలో దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా కనిపించారు. వీరిద్దరికి ఇదివరకే మొదటి సంతానంగా కవీర్ అనే కుమారుడు ఉన్నాడు.

Also Read: Yuvraj Singh: అభిషేక్ శర్మ ప్రపంచకప్లో స్థానం లభించడం ఛాన్సే లేదు.. ఇంకా నేర్చుకోవాలి..!

కాగా ఇప్పుడు కృనాల్ దంపతులకు జన్మించిన మరో మగ బిడ్డకు ‘వాయు’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టిజెన్స్ తోపాటు అనేకమంది ప్రముఖులు, ఆటగాళ్లు పెద్దఎత్తున దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments