NTV Telugu Site icon

Kriti Sanon : పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ని చూసి ఫిదా అయ్యాను..

Whatsapp Image 2023 08 26 At 4.23.22 Pm

Whatsapp Image 2023 08 26 At 4.23.22 Pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా  జాతీయ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకుని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం లో మునిగి తెలుతున్నారు… అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి..ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా ఎంతో ఖుషీగా ఉన్నారు. పుష్ప సినిమా కు తాను చేసిన హార్డ్ వర్క్ కు తగిన ఫలితం రావడంతో ఆ సక్సెస్ ను అల్లు అర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక బాలీవుడ్ లో కొన్ని వర్గాల నుండి విమర్శలు కూడా వస్తున్నాయి అలాగే చాలా మంది అల్లు అర్జున్ కి సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెబుతున్నారు.

మరి తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా అల్లు అర్జున్ కు అభినందనలు తెలుపుతూ ఆయనపై ప్రశంసలు కురిపించింది.కృతి సనన్ కు మిమి సినిమా కు గాను ఉత్తమ నటిగా అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలిపాడు.. దీనికి స్పందిస్తూ ఆమె థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ కు అవార్డు రావడంపై తన పోస్ట్ లో స్పందించింది.ఈమె చెబుతూ పుష్ప గా అల్లు అర్జున్ ని చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యిందని.. తన హార్డ్ వర్క్ కు ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చింది.. ఇక నేషనల్ అవార్డుకు మీరు నిజంగా అర్హులు అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించింది. ఈమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు…ఏది ఏమైనా పుష్ప రాజ్ పేరు ప్రస్తుతం మారు మ్రోగిపోతుంది.

https://twitter.com/kritisanon/status/1695087426287657446?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1695087426287657446%7Ctwgr%5Ede81db268012890261721ab8f579e974d177d646%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F