Krishnamachari Srikkanth: “గంభీర్ ఇప్పటికైనా మారు”.. కోచ్ నిర్ణయాలపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnamachari Srikkanth: టీ20 ప్రపంచకప్‌లో భారత్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. మొదటి నుంచి వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ వచ్చిన సూర్య సేన సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో పడింది. సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే భారత్ తప్పనిసరిగా వెస్టిండీస్, జింబాబ్వేపై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ఇప్పటికే కోచ్ గంభీర్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే.. తాజాగా 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్, మాజీ చీఫ్ సెలెక్టర్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కీలక సూచనలు చేశారు. గంభీర్ మరింత బాధ్యత తీసుకోవాలని సూచించారు. తుది జట్టును నిర్ణయించడం, వ్యూహాలు రూపొందించడం కోచ్ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. అక్షర్ పటేల్‌ను జట్టులో నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం ఎంత వరకు కరెక్ట్, శుభ్‌మన్ గిల్ విషయంలోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు. ఇకపై టీ20ల్లో వైస్ కెప్టెన్ అవ్వడానికి ఎవరూ ముందుకు రారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఇదిలా ఉండగా.. మొన్న దక్షిణాఫ్రికా ఏకంగా 76 పరుగులు తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ ఓటమి భారత టీ20 చరిత్రలో అత్యంత నిరాశాజనకమైన ఓటముల్లో ఒకటిగా శ్రీకాంత్ అభివర్ణించారు. 2022 సెమీఫైనల్ ఓటమి తర్వాత ఇదే అత్యంత చేదు ఫలితమని చెప్పారు. ఈ ఓటమితో జింబాబ్వేతో మ్యాచ్ కీలకంగా మారిందని, వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ ఫలితమూ భారత్‌కు ముఖ్యమైందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇతర జట్ల ఫలితాలపై భారత్ ఆదారపడాల్సి వచ్చిందని విమర్శించారు. ఇక సూపర్ 8లో భాగంగా భారత్‌కు రెండో అగ్ని పరీక్ష వెస్టిండీస్‌తో ఉండనుంది. ఈ రోజు వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.
READ MORE: CABINET DECISSIONS Full Details: తెలంగాణలో మెగా నిర్ణయాలు.. ఎవరికెంత లాభం.?
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..