NTV Telugu Site icon

Krishnam Raju: కన్నీరుమున్నీరవుతున్న మొగల్తూరు

West Lrrishna

West Lrrishna

తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన స్వస్థలం మొగల్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజుకు మొగల్తూరులో సొంత నివాసం ఉన్నప్పటికీ ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదు. కృష్ణంరాజు జిల్లాకు ఎప్పుడొచ్చినా ఆయన తప్పక మొగల్తూరు వచ్చి కొద్దిసేపు ఈ నివాసంలో ఉండటం ఆనవాయితీగా ఉంటూ వస్తుంది. ఆయన సోదరుడు అంటే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు హైదరాబాదులో మృతి చెందినప్పుడు దహన సంస్కారాలన్నీ అక్కడే పూర్తి చేసి, దిన కార్యక్రమం మాత్రం స్వస్థలం మొగల్తూరులో నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణంరాజు కార్యక్రమం ఎక్కడ జరుపుతారన్నది కూడా మొగల్తూరులో చర్చనీయాంశంగా మారింది.

Read Also: Rebel star Krishnam Raju: ఎంద‌రికో స్ఫూర్తి.. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌జీవితం!

కృష్ణంరాజు మృతి పట్ల టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు మొగల్తూరు వాసులు..మొగల్తూరు సెంటర్ లో కృష్ణం రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అభిమానులు..ఆయనతో తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు ఆయన అభిమానులు. కృష్ఱంరాజు మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు ఉభయ గోదావరి వాసులు, రాజకీయ ప్రముఖులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉభయగోదావరి జిల్లాల నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన మృతి నన్ను కలచివేసింది. బిజెపి అభివృద్ధి లో ఆయన తనదైన ముద్ర వేసిన మహనీయులు. కుటుంబ సభ్యులు తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు సోమువీర్రాజు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి క్రియాశీలకంగా చేసి చూపించి న బిజెపి కేంద్ర మంత్రి గా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. పార్టీ అభివృద్ధి కోసం నాకు ఆయన తో ఎనలేని అనుబంధం గుర్తుకుతెచ్చుకున్నారు సోమువీర్రాజు.