Rebel star Krishnam Raju: ఎందరికో స్ఫూర్తి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటజీవితం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ రోజుల్లో ఆరడుగుల ఎత్తు, భారీ విగ్రహంతో అలరించిన ఏకైక హీరో కృష్ణంరాజు. ఆయన పేరు వినగానే కొందరిలో ఉత్సాహం ఉరకలు వేసేది, కొందరు జడుసుకొనేవారు, మరికొందరికి ఆయన అభినయం ఆనందం పంచేది. ఇంకొందరిని ఆయన నటన మురిపించేది. ఆరంభంలోనే కె.ప్రత్యగాత్మ రూపొందించిన`చిలక-గోరింక`(1966)తో హీరోగా తెరపై తళుక్కుమన్నారు కృష్ణంరాజు. అయితే ఆ తరువాత కథానాయకునిగా నిలదొక్కుకోవడానికి కృష్ణంరాజు పడరాని పాట్లు పడ్డారనే చెప్పాలి. దాదాపు పదేళ్ళకు కృష్ణంరాజు స్టార్ డమ్ చూశారు. జనం మదిలో `రెబల్ స్టార్`గా నిలిచారు.
తెలుగు చిత్రసీమలో స్టార్ డమ్ కోసం దాదాపు పుష్కరకాలం ప్రయత్నాలు సాగించి, విజేతలుగా నిలచినవారు ఇద్దరే ఇద్దరు- వారు శోభన్ బాబు, కృష్ణంరాజు. ఈ ఇద్దరు హీరోలను అప్పట్లో యన్టీఆర్, ఏయన్నార్ బాగా ప్రోత్సహించారు. వారిచిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ తమ ఉనికిని చాటుకున్నారు. అయినా స్టార్ డమ్ చేరుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. శోభన్ బాబు హీరోగా, సైడ్ హీరోగా, కేరెక్టర్ యాక్టర్ గా సాగుతూ చివరకు `తాసిల్దార్ గారి అమ్మాయి`తో స్టార్ డమ్ చూశారు. అయితే కృష్ణంరాజుకు హీరోవేషాలు అంతగా దక్కలేదు. అయినా కృష్ణంరాజు నిరాశ చెందలేదు. తనకు లభించిన విలన్ రోల్స్ లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ రోజుల్లో కృష్ణంరాజును విలన్ గా తెరపై చూసిన మహిళా ప్రేక్షకులు ఆయన పేరు చెప్పగానే జడుసుకొనేవారు. అలాంటి కృష్ణంరాజు ఆ ముద్ర నుండి బయట పడడానికి `కృష్ణవేణి, అభిమానవంతులు, మేమూ మనుషులమే` వంటి చిత్రాలలో సాఫ్ట్ కేరెక్టర్స్ పోషించారు.
Also Read
ఈ చిత్రాలలో`కృష్ణవేణి` మినహా ఏ చిత్రమూ విజయం సాధించలేదు.అయినా మెల్లగా కృష్ణంరాజును కూడా హీరోగా చూడడానికి జనం అలవాటు పడేలా చేసుకున్నారు. ఆ తరువాత `భక్త కన్నప్ప`తో నటునిగా జనం మెదిని మెప్పించడమే కాదు, స్టార్ డమ్ నూ సొంతం చేసుకున్నారు. `అమరదీపం` చిత్రంతో నంది అవార్డుల్లో తొలి ఉత్తమనటునిగా నిలిచారు. ఆ పై మాస్ సినిమాలతోనూ ఆకట్టుకోవడం మొదలెట్టారు. దాసరి నారాయణరావు రూపొందించిన “కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ“ చిత్రాలు కృష్ణంరాజును `రెబల్ స్టార్`గా నిలిపాయి. ఆ తరువాత నుంచీ ఆయన మరి వెనుదిరిగి చూసుకోలేదు.
Read Also: Heavy Rains: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇలా కృష్ణంరాజు సినీప్రయాణం తరువాతి రోజుల్లో ఎందరో హీరోలకు స్ఫూర్తిగా నిలచింది. కృష్ణంరాజు స్ఫూర్తితోనే చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్ వంటివారు తొలుత చిన్న వేషాలు, విలన్ రోల్స్ చేసినా తరువాత హీరోలుగానూ, అటుపై స్టార్స్ గానూ రాణించారు. ఆ తీరున ప్రస్తుతం చిత్రసీమలో ప్రవేశిస్తున్న ఎందరో నటులకు కృష్ణంరాజు చలనచిత్ర జీవితం ప్రేరణగా నిలచిందని చెప్పవచ్చు.
Heavy Rains: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తాజావార్తలు
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?