తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు ( కృష్ణబాబు ) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కృష్ణబాబు.. మృతదేహాన్ని రేపు సాయంత్రం స్వగ్రామం దొమ్మేరుకు తీసుకు వెళ్లనున్నట్లు బంధువులు ప్రకటించారు. ఇక, ఐదుసార్లు కొవ్వూరు ఎమ్మెల్యేగా కృష్ణ బాబు విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983, 1985, 1989, 1994, 2004, వరకు ఒక్కసారి మినహా మిగిలిన 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు ( కృష్ణబాబు ) 1940 జనవరి 2వ తేదీన పాలకొల్లులో జన్మించారు. ఈయన టీడీపీ తరపున ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబులతో పెండ్యాల వెంకట కృష్ణారావుకి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణ వార్త విన్న తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.
Pendyala Venkata Krishna Rao: కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కన్నుమూత
Show comments