Koti Deepotsavam 4th Day: వైభవంగా కోటి దీపోత్సవం.. నాగుల చవితి వేళ రాహుకేతు పూజ, శ్రీకాళహస్తీశ్వర కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 4th Day: భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది. ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం నాలుగో రోజు ఘనంగా ముగిసింది. నవంబర్ 14న ప్రారంభమైన కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది.
Also Read: World Cup 2023 Final: చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్కప్ ఫైనల్ ఈవెంట్
Also Read
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
నాలుగోరోజు కోటి దీపోత్సవం వేదికైన ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి. నాగులచవితి శుభవేళ భక్తుల గ్రహదోషాలు హరించేలా శ్రీకాళహస్తి ఆలయ అర్చకులచే రాహుకేతు పూజ నిర్వహించారు. అనంతరం అనంతపుణ్యప్రదం శ్రీకాళహస్తీశుని కల్యాణోత్సవాన్ని చూసి తరించారు భక్తులు. సింహ, గజ వాహనాలపై పార్వతీపరమేశ్వరుల దర్శనంతో భక్తులు పులకరించిపోయారు. భక్తులకు సకలసౌభాగ్యాలను ప్రసాదించే కొల్హాపూర్ మహాలక్ష్మీ దివ్యదర్శనం కలిగింది. కంచి కామాక్షి అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. కుక్కే శ్రీసుబ్రహ్మణ్య మఠం శ్రీవిద్యాప్రసన్న తీర్థస్వామి అనుగ్రహభాషణం చేశారు. శ్రీ మల్లాది వేంకట రామనాథశాస్త్రి ప్రవచనామృతాన్ని వినిపించారు. కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు.. స్వర్ణలింగోద్భవ వైభవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. మహాదేవునికి మహానీరాజనంతో పాటు అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో నాలుగోరోజు కోటి దీపోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది. నాలుగో రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోత్సవ వేదిక జనసంద్రంగా మారిపోయింది. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాదేవుని ఆశీస్సులు పొందారు.
Also Read: Koti Deepotsavam Day 4 LIVE : నాగుల చవితి శుభవేళ రాహుకేతు పూజ, శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణోత్సవం
ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా అనిపించింది. మరోవైపు భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ పక్షాన పూర్తి ఉచితంగా అందించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటిదీపోత్సవం జరగనుంది.. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ మహాశివుడి అనుగ్రహం పొందాలని భక్తి టీవీ ఆహ్వానం పలుకుతోంది. కార్తిక మాసం, నాగుల చవిత వేళ.. కోటిదీపోత్సవంలో పాల్గొనండి.. ఆ మహాదేవుడి కృపకు పాత్రులుకండి..
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?