Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
- స్వామీజీల అనుగ్రహ భాషణం
- శ్రీహరికి మహాభిషేకం
- వైభవంగా శ్రీనివాస కల్యాణం
- గరుడ వాహన సేవ, సప్తహారతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా 15వ రోజు అయిన నవంబర్ 28, శనివారం (కార్తీక బహుళ పంచమి) పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ స్వామీజీల అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, శ్రీహరికి మహాభిషేకం, శ్రీనివాస కల్యాణ మహోత్సవం వంటి విశేష ఘట్టాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి.
అనుగ్రహ భాషణం, ఆధ్యాత్మిక ప్రవచనం
ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా బాలాపూర్‌కు చెందిన శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ, మహామండలేశ్వర్ శ్రీ సిద్ధేశ్వరగిరి మహారాజ్ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం అష్టావధాని డా. ధూళిపాళ్ల మహాదేవమణి ఆధ్యాత్మిక ప్రవచనామృతం వినిపించి భక్తులను ఆకట్టుకున్నారు.
Also Read
- Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
- AP Govt: మీకు గుంత కనిపించిందా.. వెంటనే ఇలా చేయండి.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
- Rahul Gandhi : మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపిస్తున్నారు.. 850 సీట్లు ఎందుకు?
శ్రీనివాస కల్యాణ మహోత్సవం.. విశేష పూజలు
వేదికపై శ్రీహరికి మహాభిషేకం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహించగా, భక్తులచే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు కోటిపుష్పార్చన కార్యక్రమం భక్తిభావంతో సాగింది. భక్తుల సమక్షంలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించగా, స్వర్ణ లింగోద్భవం, సప్తహారతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భక్తుల ఆనందం.. నిర్వాహకుల ఆహ్వానం
కార్తీక మాసంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమాలు భక్తులకు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. ముఖ్యంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవతో పాటు స్వర్ణ లింగోద్భవం, సప్తహారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఏడాది లాగే పూజా సామగ్రిని ఉచితంగా అందిస్తున్న రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ కోటి దీప యజ్ఞంలో పాల్గొనాలని భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.
కోటిదీపోత్సవం-2026, 15వ రోజు ఉత్సవంలో భాగంగా శ్రీనివాస కల్యాణోత్సవం(2/2)..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/oqk1RNjLwV
— BhakthiTV (@BhakthiTVorg) November 28, 2026
కోటిదీపోత్సవం-2026 15వ రోజు ఉత్సవంలో భాగంగా పల్లకీ శ్రీవేంకటేశ్వర ఉత్సవమూర్తుల ఊరేగింపు..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/YpcpWPCkzt
— BhakthiTV (@BhakthiTVorg) November 28, 2026
Divine Rangoli Art of Sri Venkateswara and Padmavathi Devi Kalyanam | Koti Deepotsavam 2026 DAY 15 | Bhakthi TV
#SrinivasaKalyanam #VenkateswaraSwamy #PadmavathiDevi #RangoliArt #KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/Xnzf3Ujpvh
— BhakthiTV (@BhakthiTVorg) November 28, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!