Koti Deepotsavam 2025 Day 5: శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో దివ్య వైభవం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 5: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు అద్భుతమైన భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపాల మహోత్సవం, “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి చాటుతోంది.

Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఐదవ రోజు కార్యక్రమం గురువుల ఆశీస్సులతో, వేద మంత్రాలతో ప్రారంభమైంది. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం పీఠాధిపతి, మైసూరు) ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం భక్తుల హృదయాలను తాకింది. తదుపరి పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తింది. అయితే.. ఐదవరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచ్చేశారు.
అలాగే వేదికపై వేదికపై మహాదేవునికి అన్నాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి పూజలు, భక్తులచే శివలింగాలకు భస్మాభిషేకం వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. అనంతరం శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం, పల్లకీ వాహన సేవతో భక్తులకు దివ్య దర్శనం లభించింది. చివరలో సప్తహారతి, లింగోద్భవ దర్శనంతో నాలుగవ రోజు వేడుక కన్నుల పండువగా ముగిసింది. వేలాది దీపాలతో ప్రకాశించిన వేదిక కైలాసాన్ని తలపించింది.
కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఈ నెల 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. భక్తి, ఆరాధన, ఆనందాల సమ్మేళనంగా ఈ కోటి దీపోత్సవ మహోత్సవం అందరినీ ఆహ్వానిస్తోంది.
— BhakthiTV (@BhakthiTVorg) November 5, 2025
కోటి దీపోత్సవం ఐదో రోజున కార్తిక పున్నమి వెలుగుల్లో.. సకల శ్రేయోదాయకం.. మహాదేవునికి అన్నాభిషేకం..#GarikapatiNarasimhaRao #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/blliW4ftB9
— BhakthiTV (@BhakthiTVorg) November 5, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!