Koti Deepotsavam 2024 Day 1: కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్‌లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది. కోటిదీపోత్సవం-2024 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024లో మొదటి రోజు విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ.. నంబూరు శ్రీకాళీ వనాశ్రమాధిపతి యోగిని శ్రీచంద్ర కాళీ ప్రసాద మాతాజీ గార్లచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరు శ్రీనివాసరావు ప్రవచనామృతం.. వేదికపై కాశీస్పటిక లింగానికి శత అష్టోత్తర శంఖాభిషకం.. భక్తులచే స్వయంగా కోటిమల్లెల అర్చన.. ఇక, కోటి దీపోత్సవం వేదికపై కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం.. అనంతరం హంసవాహనంపై ఆదిదంపతులు దర్శనం ఇవ్వనున్నారు.. సాయంత్రం 5.30 గంటలకు భక్తి టీవీ కోటి దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజే భక్తులు భారీగా తరలివచ్చారు. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.