Koti Deepotsavam 2023 12th Day: 12వ రోజు కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇల కైలాసంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలను వీక్షించి లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులయ్యారు. ఇదిలా ఉంటే.. భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్. కాగా.. ఈ రోజు జరిగిన విశేష కార్యక్రమాలు ఏం జరిగాయంటే….
Telangana Elections 2023: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్
వైకుంఠ చతుర్ధశి శుభ సందర్భంగా కైలాస ప్రాంగణంలో తిరుమల వెంకన్న సాక్షాత్కారం నిర్వహించారు. అనంతకోటి పుణ్యప్రదం భక్తులచే గోవింద నామస్మరణ చేశారు. తర్వాత శ్రీదేవీభూదేవీ సమేత శ్రీనివాస కల్యాణం జరిపారు. పల్లకీలో ఏడుకొండలస్వామి అనుగ్రహాన్ని కల్పించారు. భక్త జనానికి కొల్హాపూర్ మహాలక్ష్మి, కంచికామాక్షి అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్తవిజయానంద తీర్థస్వామి అనుగ్రహ భాషణం చేశారు. పుష్పగిరి మహాసంస్థానం శ్రీ విద్యా శంకరభారతి మహాస్వామి ఆశీర్వచనం.. అంబరాన్ని అంటే మహాదేవుని నీరాజనాలు చేశారు. ఆ తర్వాత కోటి దీపాల వెలుగులతో స్టేడియం మొత్తం అందంగా జివ్వుజివ్వున మెరిసిపోయింది. కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు.. స్వర్ణలింగోద్భవ వైభవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. మహాదేవునికి మహానీరాజనంతో పాటు అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో 12వ రోజు కోటి దీపోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది.
Thiruveer: ఈ కుర్రాడు జోరు మాములుగా లేదుగా..
ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.. ఈ నెల 14వ తేదీన ప్రారంభం.. ఈ నెల 27వ తేదీతో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది..