Site icon NTV Telugu

Kothapalli Geetha: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం..

Geetha

Geetha

ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతుంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి చేపడుతామని చెబుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా.. అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Rajasthan: విషాదం.. తండ్రి గొంతు కోసి, తన కొడుకుతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంపచోడవరంలో గిరిజనులను, గిరిజనేతరులను గుప్పెట్లో పెట్టుకొని నియంతలా పాలిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లను స్థానికులు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలు కోరిన పనులను గెలిచిన వెంటనే స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కొత్తపల్లి గీత హామీనిచ్చారు.

IPL 2024 Playoffs Scenario: ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరం.. రెండు స్థానాలకు నాలుగు జట్ల మధ్య పోటీ! ఆర్‌సీబీకి కష్టమే

ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుమూల గ్రామాలైన చెరుకుపాలెం జడ్డంగి, సింగంపల్లి, వట్టిగడ్డ దూసరపాము, రాజవోమ్మంగి వరకు రంపచోడవరం నియోజవర్గ అభ్యర్థిని మిరియాల శిరీష దేవితో కలిసి బైక్ ర్యాలీ రోడ్డుషో పర్యటన చేపట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని.. ఈ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. ర్యాలీలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలికారు.

Exit mobile version