ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈరోజు సాయంత్రం తెరపడనుంది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గా్ల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో.. పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. చివరి రోజు కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీని ఆశీర్వాదించాలంటూ, తమ పార్టీకి ఓటేస్తే జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు.
Banker Death: వారానికి 100 గంటలు పని.. 35 ఏళ్ల బ్యాంకర్ మృతి..
ఈ క్రమంలో.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం వీఆర్పురం మండలం మారుమూల గ్రామాలలో ఎన్డీఏ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత, రంప చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి రోడ్డు షో ప్రచారం నిర్వహించారు. రోడ్డు పొడవునా ప్రజలు బారులు తీరి.. ఆదివాసి గిరిజనులు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో పాటు.. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై నినాదాలు చేశారు.
Navneet Kaur Rana: ఒవైసీ సోదరులకు నవనీత్ కౌర్ మరో వార్నింగ్