Kotha Cinema: బొగ్గుబావి నుంచి టాలీవుడ్‌కి వంద మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఉండే గ్లామర్ మాత్రమే కాదు.. పల్లెపల్లెనా, ప్రతి గల్లీలోనూ అద్భుతమైన కళ దాగి ఉంటుందని నిరూపిస్తూ తెరకెక్కిన చిత్రం “కొత్త సినిమా”. సురేష్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు అజర్ తెరకెక్కించిన ఈ వినూత్న చిత్ర ప్రమోషనల్ సాంగ్ ‘మేము కూడా సినిమా తీసినామురో..’ హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, దర్శకుడు సాయిలు కంపాటి, నటుడు ఆర్కే సాగర్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమాతో 100 మంది కొత్త నటీనటులు పరిచయం కానున్నారు.
సినిమా రంగంలోకి రావాలంటే ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి అనుకునే రోజుల్లో, ఏకంగా వంద మంది స్థానిక కొత్త నటీనటులను ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేయడం ఒక సంచలనంగా మారింది. ఈ సందర్భంగా నటుడు ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. “దర్శకుడు అజర్ తండ్రి హుస్సేన్ తన కొడుకు సినిమా కలను నిజం చేయడం కోసం సింగరేణి ఉద్యోగిగా తను 40 ఏళ్ల పాటు పడిన కష్టాన్ని, తన పీఎఫ్ డబ్బులను ఈ సినిమా నిర్మాణానికి పెట్టుబడిగా పెట్టారు” అని ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు సాయిలు కంపాటి కూడా హుస్సేన్ ని ఈ చిత్రానికి రియల్ హీరోగా అభివర్ణించారు.
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
దర్శకుడు అజర్ మాట్లాడుతూ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. “చాలా మంది మేము కింది స్థాయి నుంచి వచ్చాం అంటారు.. కానీ మేము ఇంకా కింది స్థాయి నుంచి, భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిల నుంచి వచ్చాం. చీకటిని చీల్చుకుంటూ వెలుగులు పంచే రామగుండం ప్రాంతం మాది. పట్నంలోనే కాదు, గల్లీ గల్లీలోనూ కళ ఉంటుందని నిరూపిస్తూ, మన ఊర్లోనే ఉంటూ మన వాళ్లతో సినిమా తీయొచ్చని ఈ చిత్రం ద్వారా నిరూపించాం” అని గర్వంగా చెప్పారు.
తాజావార్తలు
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!