NTV Telugu Site icon

Koratala Siva: శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ కొరటాల.. ఇది ఓ ఆనవాయితీ!

Koratala Siva Tirumala

Koratala Siva Tirumala

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు కొరటాలకు తీర్థప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చారు. మెట్ల మార్గాన కొరటాల తిరుమల కొండకు చేరుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. ‘నేను దర్శకత్వం వహించిన చిత్రం విడుదలకు ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అవుతోంది. శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చాను.నా తదుపరి ప్రాజెక్ట్ వివరాలను దేవర విడుదల తర్వాత వెల్లడిస్తా’ అని కొరటాల చెప్పారు. ‘జ‌న‌తా గ్యారేజ్’ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమానే దేవర. ఈ మూవీపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. కొరటాల చివరి సినిమా ఆచార్య ఫ్లాఫ్ కావడంతో.. అయనకు మంచి జరగాలని, బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: Kanyaka Movie: ఓటీటీల్లో ‘కన్యక’ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. నిర్మాతల ఆనందం!

దేవరలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీతో బాలీవుడ్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దేవర సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదలకు ముందే ఈ చిత్రం అరుదైన ఘనతలు సొంతం చేసుకుంటోంది. రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు కొల్లగోడుతుందో చూడాలి.

Show comments