Site icon NTV Telugu

Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?

Koratala Siva

Koratala Siva

Koratala Siva: టాలీవుడ్‌లో కమర్షియల్ హంగులతో కూడిన సందేశాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ కొరటాల శివ. ఎన్టీఆర్‌తో ఆయన తెరకెక్కించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించినప్పటికీ, ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్ పరంగా ఒక రకమైన సందిగ్ధతను ఎదుర్కొంటున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వరుసగా స్టార్ హీరోల నుంచి ఆయనకు నిరాశే ఎదురవుతుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ గా మారింది.

READ ALSO: Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

ఎన్టీఆర్ బిజీ.. ‘దేవర 2’ ఎప్పుడు..
నిజానికి ‘దేవర’ పార్ట్-1 సక్సెస్ తర్వాత అందరూ వెంటనే రెండో భాగం ఉంటుందని ఆశించారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుతో పాటు ఇతర భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ పట్టాలెక్కడానికి కనీసం ఏడాదిన్నర పైగా సమయం పట్టేలా ఉందని టాక్. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలని కొరటాల భావించినా, అది అనుకున్నంత సులభం కావడం లేదని సమాచారం. ఈ ఖాళీ టైంలో కొరటాల శివ టాలీవుడ్ టాప్ హీరోలైన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లను సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య యువ దర్శకులకు, ప్రయోగాత్మక కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కొరటాల ప్రతిపాదనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. పవన్ సైతం తన పొలిటికల్ కమిట్‌మెంట్స్, ఇప్పటికే లైనప్‌లో ఉన్న దర్శకులకే మొగ్గు చూపుతున్నారని జోరుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు అక్కినేని నాగచైతన్య 25వ సినిమాకు కూడా కొరటాల పేరు వినిపించినా, అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం చిన్న హీరోలతో సినిమాలు చేసే ఆసక్తి కొరటాలకు లేకపోవడంతో ఆయన డైలమాలో పడ్డారని అంటున్నారు. మొత్తానికి కొరటాల ముందున్న ఏకైక మార్గం ఎన్టీఆర్ డేట్స్ కోసం వేచి చూడటమే అని చెబుతున్నారు. తారక్ ఫ్రీ అయ్యే వరకు ‘దేవర 2’ స్క్రిప్ట్ పనులకే ఆయన పరిమితం కావలసి ఉంటుంది. ఒకప్పుడు వరుస హిట్‌లతో హీరోలందరూ క్యూ కట్టిన ఈ స్టార్ డైరెక్టర్‌కు, ఇప్పుడు సరైన ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

READ ALSO: Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

Exit mobile version