Site icon NTV Telugu

Koppula Eshwar : ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో ఉంటాం లేకుంటే లేదు

Koppula Eshwar

Koppula Eshwar

జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించిన అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ వేశారు. నేను జగిత్యాల చౌరస్తాలో ముక్కు భూమికి రాస్తా జీవన్ రెడ్డి నువ్వు రాస్తావా అని ఆయన సవాల్‌ విసిరారు. ఈథనల్ ఫ్యాక్టరీ ద్వార మూడు కోట్ల లీటర్ల విషపు నీరు వస్తాయని జీవన్ రెడ్డి ప్రజలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎలాంటి విషపు నీరు రాదని నిపుణులు చెబుతున్నారని, ఈథానల్ ఫ్యాక్టరీ నుండి ఒక్క చుక్క విషపు నీరు కూడా రాదని నేను ముక్కు భూమికి రాస్తా జగిత్యాల చౌరస్తాలో జీవన్ రెడ్డి ముక్కు భూమి రాస్తాడా అని యనా అన్నారు. రాజకీయాల్లో రిటర్మెంట్ వస్తున్నారు మన స్వార్థం కోసం సమాజానికి చేటు చేయొద్దు ఇది రాజనీతి కాదు జీవన్ రెడ్డి అని, రాజకీయాల్లో ఓడుతాం గెలుస్తాం అది వేరు విషయమని, ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో ఉంటాం లేకుంటే లేదన్నారు. ఈ అధికారం లో ఏమున్నది, ఎన్నిసార్లు చూస్తాం అధికారాన్ని అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Project K: ఓరి బాబో.. రూమర్స్ తోనే చచ్చిపోయేలా ఉన్నాం.. అది నిజమో కాదో చెప్పండయ్యా

నిజాం హయాంలో నిర్మించిన నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లో ఎంజీఎం తప్పా సమైక్య పాలనలో పెద్ద దవాఖానలు నిర్మించలేదన్నారు. ఈ సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద దవాఖానలు రాష్ట్రంలో మరో నాలుగు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ల్యాబ్‌లలో 134 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం మాతాశిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.

Also Read : Adipurush AI Photos: అవన్నీ గ్రాఫిక్స్ రా.. ఒరిజినల్ అంతేమి లేదిక్కడ

Exit mobile version