Site icon NTV Telugu

Koppula Eeshwar: రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మానుకోవాలి

Koppula

Koppula

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. ఇవాళ కొప్పుల ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడూ.. విర్రవీగే మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని, విచారణల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు కొప్పుల ఈశ్వర్‌. దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఆపేశారని కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చిల్లరగా మాట్లాడుతున్నారని కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు.

Ananya Panday: అబ్బా అనన్య..ఇలా చూపిస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కిపోదు..

కవిత అరెస్ట్ సహా పలు ఘటనలు తమ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన కవిత అరెస్ట్ ఘటనపై మాట్లాడుతూ… అధికారంలో ఉన్నామని భయపెట్టి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు. అసమానతలు, అణచివేత వల్లే నక్సల్ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టుకు వచ్చాయన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణ గడ్డపై మరో ఉద్యమం పుడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవారు ఉన్నారని పేర్కొన్నారు.

Bachhala Malli : సరికొత్త కథాంశంతో వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి..

Exit mobile version