Site icon NTV Telugu

Koppu Basha : దుర్గం చిన్నయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి

Koppu Basha

Koppu Basha

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మహిళలపై చేస్తున్న దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలకు బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొప్పుభాష స్పందిస్తూ దుర్గం చిన్నయ్య వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పలువురు బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు నిత్యం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నరని అన్నారు. నిన్నటి రాజయ్య మహిళలపై వేధింపుల సంఘటన మరువకముందే నేడు చిన్నయ్య దాష్టికలు బయటకు రావడం మహిళ సమాజాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నదన్నారు. ఇక ఈ చిల్లర బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు మరియు బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణలో రోజులు దగ్గరపడ్డాయని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Also Read : India-Russia: భారత్‌కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..

అయితే.. దుర్గం చిన్నయ్య ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని… బెల్లంపల్లి అసెంబ్లీలో నెన్నెల మండలంలో దాదాపు 200 ఎకరాల భూమి కబ్జా చేసినట్లు దుర్గం చెన్నయ్యపై అరోపణలు ఉన్నాయన్నారు. సింగరేణి మరియు వివిధ ప్రబుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసిన చిన్నయ్యకు ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన మహిళలను టార్గెట్ చేయటం చిన్నయ్యకు కొత్తేమి కాదన్నారు. గతంలో లక్ష్మీ అనే మహిళ తన భూమి చిన్నయ్య మరియు అతడి అనుచరులు అక్రమంగా కబ్జా చేశారని హరీష్ రావు సమక్షంలో పురుగుల మందు తాగిందన్నారు. గతంలో అకారణంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ AE పై దాడి చేసిన సంఘటన ప్రభుత్వ ఉద్యోగులపై చిన్నయ్యకున్న అహంకార ధోరణికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

Also Read : The Sun: సూర్యుడి ఉపరితలంపై భారీ రంధ్రం.. భూమికి ప్రమాదమా..?

అంతే కాక నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని చాలా మందిని మోసం చేశాడని, ఇలా చెప్తూ పోతే చిన్నయ్య చరిత్ర ఈ రోజుదో ఒడిసేది కాదని ఆయన మండిపడ్డారు. తాజాగా ఆరిజన్ డైరీ నిర్వాహకులను డబ్బుల కోసం మరియు చిన్నయ్య తన కామ కోరికలు తీర్చటం కోసం అనేక రకాలుగా అందులోని మహిళ నిర్వాహకులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులు పెట్టినట్లు వార్తల్లో వస్తున్న కథనాలు మనసును చిధిమేస్తున్నాయని అన్నారు. ఇలాంటి కామపూరిత రాక్షస వ్యక్తిత్వం గల చిన్నయ్యకు MLA గా కొనసాగే నైతికత లేదన్నారు. చిన్నయ్య బాధితులకు బీజేపీ యస్సిమోర్చా అండగా ఉంటుందని భాష గారు తెలిపారు.

Exit mobile version