Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy : మోడీ ఉచిత బియ్యం ఇస్తే.. తాను ఇచ్చినట్లు చెప్పాడు కేసీఆర్‌

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ, మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఏమి చేయలేదని దుష్ప్రచారాలు చేశారు కేసీఆర్ అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం చేశారన్నారు. ఉచిత బియ్యం కూడా నేనే ఇస్తున్నానని ప్రచారం చేశాడు కేసీఆర్‌ అని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర నేనే పంపిస్తాను అన్నాడని, స్థంబాలకు లైట్‌ బుగ్గలు నేనే ఇస్తున్న అన్నాడు రోడ్లు నేనే వేస్తున్న అని చెప్పుకున్నాడు కేసీఆర్ అని.. కానీ నిజం తెలిసి.. ప్రజలు కేసీఆర్ ని బొంద పెట్టిండ్రు అన్నారు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.

అంతేకాకుండా..’కొత్త ఆయనను తీసుకొని వచ్చారు ఐదు వారాలు బాగానే నడిపించిండు మా పెద్దన్న పెద్దన్న అంటూ మోడీ దగ్గరికి వెళ్ళాడు… ఎందుకంటే కొత్త ఆయన రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు… ఎందుకంటే ఈయన దగ్గర ఏమీ డబ్బులు లేవు పాత ఆయన కేసీఆర్ అప్పులు పెట్టిపోతే అప్పులు కట్టే టైం వచ్చింది… పాతయనా చిప్ప పెట్టి పోయిండు… రాష్ట్రాన్ని నడిపియాలంటే డబ్బులు అవసరం… మా పెద్దన్న మా పెద్దన్న అంటూ మోడీ దగ్గరకు వెళ్ళాడు సీఎం రేవంత్ రెడ్డి … పెద్దాయన తీరుగానే ప్రవర్తించి రాష్ట్రానికి 9000 కోట్లు ఇచ్చాడు, తర్వాత 3000 కోట్లు ఇచ్చాడు రాష్ట్రం నడుస్తుందంటే మోడీ వల్ల నడుస్తుంది చేవెళ్ల బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి… కాంగ్రెస్ సీఎంకు పెద్దన్న మోడీ ఇచ్చిన వాగ్దానానికి డబ్బులు లేవు కరెంటుకు డబ్బులు లేవు దృశపత్చారానికి ఆకర్షణలు కాకండి కమలం పువ్వు గుర్తు మోడీ గారికి ఓటెయ్యండి. చేవెళ్ల బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి….’ అని కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version